ఒక్కడే అంతర్యామి అద్భుతమైన అన్నమాచార్య వైరాగ్య సంకీర్తన. రాగం : రేవతి

2024-07-28に共有
సంకీర్తన :ఒక్కడే అంతర్యామి
రాగం : రేవతి
స్వరపరచిన వారు : శ్రీ సాలూరి వాసురావు గారు

ప|| ఒక్కడే అంతర్యామి వుపకారి చేపట్టు | తక్కినవి యిన్నియును తలపు రేచెడిని ||

చ|| యెఱుగుమీ జీవుడా యింద్రియాలు సొమ్ము గావు | గుఱియై మాయలలోన గూడించే వింతె |
మఱవకు జీవుడా మనసు చుట్టము గాదు | తెఱగొప్ప ఆసలనే తిప్పెడి దింతె ||

చ|| సమ్మతించు జీవుడా సంసార మొకజాడ గాదు | బిమ్మటి పొద్దొకజాడ పెనచు నింతె |
యిమ్ముల శ్రీవేంకటేశు డితనిమూలమే యింత | నెమ్మి దానే గతియంటే నిత్యమౌ నింతే ||

コメント (20)